వచ్చే విద్యా సంవత్సరానికి (2025-26) సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీశాబ్) ఛైర్మన్‌గా తెలంగాణలోని నల్గొండ నగరానికి చెందిన ఆచార్య కరణం ఉమామహేశ్వర్‌రావు నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఐటీ ఖరగ్‌పూర్ ఆచార్యుడైన ఆయన 2022 ఫిబ్రవరి నుంచి ఒడిశాలోని ఎన్‌ఐటీ రూర్కెలా సంచాలకుడిగా కొనసాగుతున్నారు.
2017 నుంచి 2022 వరకు అయిదేళ్లపాటు కర్నాటకలోని ఎన్‌ఐటీ సూరత్‌కల్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.