ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఇటీవల స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ‘ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024’ నివేదికను విడుదల చేసింది.
ఇందులో ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 12 భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించింది.
ఈ జాబితాలో మేఘాలయలోని బైర్నీహాట్ నగరం తొలిస్థానంలో నిలవగా తరువాతి స్థానంలో దిల్లీ ఉంది.
అదేవిధంగా ఈ జాబితాలో ముల్లన్‌పుర్(పంజాబ్), ఫరీదాబాద్, గురుగ్రామ్ (హరియాణా), లోనీ, గ్రేటర్ నొయిడా, నొయిడా, ముజఫర్‌నగర్(ఉత్తర్‌ప్రదేశ్), గంగానగర్, భివాడి,
హనుమాన్‌గఢ్(రాజస్థాన్) ఉన్నాయి.