‘స్వస్థ నారి, సశక్త పరివార్’ కార్యక్రమం కింద దేశమంతటా 6.5 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా 2025, అక్టోబరు 4న తెలిపారు.
ప్రధాని నరేద్ర మోదీ 2025, సెప్టెంబరు 17న ప్రారంభించిన ఈ కార్యక్రమం అక్టోబరు 2తో పూర్తయింది.
దీనికింద దేశమంతటా 18 లక్షల ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి 6.5 కోట్లమంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.