భారతదేశంలో ఏటా మార్చి 1న ‘సివిల్ అకౌంట్స్ డే’గా నిర్వహిస్తారు. 1976లో ఇదే రోజున ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీసెస్ (ఐసీఏఎస్) అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు దీన్ని జరుపుతున్నారు.
భారత ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆడిట్, అకౌంట్స్ విధులను వేరుచేస్తూ తీసుకొచ్చిన కీలక సంస్కరణలే ఐసీఏఎస్ స్థాపనకు మూలం.
పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (పీఎఫ్‌ఎంఎస్)కు ఐసీఏఎస్ బాధ్యత వహిస్తుంది. ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీసెస్ (ఐసీఏఎస్)కు సిబ్బందిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుంది.