Published on Sep 13, 2024
Current Affairs
స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం
స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వ్యవస్థను రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), నౌకాదళం విజయవంతంగా పరీక్షించాయి. ఒడిశా తీరంలో చాందీపుర్‌లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి 2024, సెప్టెంబరు 12న ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి.