శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి (స్విమ్స్), ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 26
వివరాలు:
1. మెడికల్ ఆఫీసర్స్ - 04
2. స్టాఫ్ నర్స్ - 04
3. ఏ.ఎన్.ఎం - 04
4. మామోగ్రఫీ టెక్నీషియన్ - 02
5. కార్డియోవాస్కులర్ టెక్నీషియన్ గ్రేడ్-2 - 02
6. డేటా ఎంట్రీ ఆపరేటర్ - 02
7. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - 02
8. మెడికో సోషల్ వర్కర్ - 02
9. ఎలక్ట్రీషియన్ - 02
10. డ్రైవర్ - 02
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/బీఎస్సీ/జీఎన్ఎం/ఎంబీబీఎస్/బీడీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఫిబ్రవరి 19, 20, 21, 22, 23.
వేదిక: కమిటీ హాల్, పాత డైరెక్టర్ కార్యాలయం, స్విమ్స్ తిరుపతి.