Published on Sep 21, 2024
Current Affairs
స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష ప్రయోగాలు
స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష ప్రయోగాలు

* తెలంగాణ రాష్ట్రం కాప్రాలోని అణు ఇంధన సంస్థ (ఎన్‌ఎఫ్‌సీ) మొట్టమొదటిసారిగా ‘మోనెల్‌ 400 అలాయ్‌ ట్యూబ్‌’లను తయారుచేసింది. ఇస్రో చేపట్టే ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో సెమీ క్రయోజెనిక్‌ లిక్విడ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థల్లో మోనెల్‌ 400 మిశ్రథాతు ట్యూబ్‌లు అత్యంత కీలకం. ఇందుకు అవసరమైన మిశ్రధాతును హైదరాబాద్‌లో ఉన్న రక్షణరంగ సంస్థ మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) సరఫరా చేసింది.