ఓడరేవుల కోసం దేశంలో మొదటి స్వదేశీ నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దీన్ని అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు 2025, నవంబరు 26న పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇప్పటికే కేరళలోని విఝింజమ్ ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్(వీఐఎస్‌ఎల్)లో అమలు చేశారు. పశ్చిమ తీరంలోని మరో రెండు ఓడరేవుల్లోనూ అమలుకు ఐఐటీ మద్రాస్‌తో చర్చలు జరుపుతున్నాయి.