వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, ఒమన్‌లు 2025, డిసెంబరు 18న చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాలు చేశాయి. ఉభయ దేశాల వృద్ధికి ఇది అనేక అవకాశాలు కల్పిస్తుందని ఒమన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆ దేశ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్‌తో ఆయన భేటీ అయ్యారు. రక్షణ, భద్రత, వాణిజ్యం-పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, సంస్కృతి, ప్రజా సంబంధాల లాంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై వారిద్దరూ చర్చించారు.
‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా)’ పేరుతో కుదుర్చుకున్న ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ, సుల్తాన్ హైథమ్‌ల సమక్షంలో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ వాణిజ్య మంత్రి కయిస్ బిన్ మొహమ్మద్ అల్ యూసెఫ్ సంతకాలు చేశారు.