ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే అంశంపై పరిశీలించేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశామేనన్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో కూడిన సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన ట్రాన్స్‌జెండర్ హక్కుల పోరాట కార్యకర్త వైజయంతి వసంత మోంగ్లీకి స్థానం కల్పించింది. అలాగే కర్ణాటకకు చెందిన అక్కై పద్మశాలి, గ్రేస్‌బాను, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ సౌరవ్ మండల్, సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ నిత్యారాజశేఖర్, అసోసియేషన్ ఫర్ ట్రాన్స్‌జెండర్ హెల్త్ ఇన్ ఇండియా సీఈఓ డాక్టర్ సంజయ్ శర్మ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు విద్య, ఉద్యోగాలు, ఇతర విషయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు విధాన రూపకల్పన చేయాలంటూ సుప్రీంకోర్టు 2025 అక్టోబరు 17న జారీచేసిన తీర్పు మేరకు ఈ కమిటీ ఏర్పడింది.