మానవ శరీరంలోని నిర్దేశిత భాగాలకు ఔషధాలు సరఫరా చేసేందుకు తయారు చేసిన సిల్క్ నానోజెల్ ఇంజెక్టర్ పరికరానికి కేంద్ర ప్రభుత్వం 2025, సెప్టెంబరు 6న పేటెంట్ మంజూరుచేసింది. ఈ ఇంజెక్టర్‌ను ఒడిశాలోని బ్రహ్మపుర(భంజవిహార్) విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పద్మాలోచన్ హేంబ్రమ్ నేతృత్వంలో పరిశోధకులు అభివృద్ధి చేశారు. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ తదితర రోగాల చికిత్సలో ఈ పరికరం కీలక పాత్ర పోషించనుంది.