Published on Feb 8, 2025
Current Affairs
సౌర విద్యుత్‌లో 100 గిగావాట్లు
సౌర విద్యుత్‌లో 100 గిగావాట్లు

100 గిగావాట్ల సౌర విద్యుత్‌ సామర్థ్యాన్ని భారత్‌ సాధించిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి 2025, ఫిబ్రవరి 7న తెలిపారు.

తద్వారా 2030 కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్య లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 

2022 నాటికి 100 గిగావాట్ల సౌర విద్యుత్‌తో కలిపి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్య లక్ష్యాన్ని సాధించాలని గతంలో ప్రభుత్వం భావించింది.

అయితే కరోనా పరిణామాల ప్రభావంతో నిర్దేశిత గడువులోగా దానిని సాధించలేకపోయింది.