సౌర కుటుంబం వెలుపల కొత్తగా పురుడుపోసుకుంటున్న ఒక గ్రహ వ్యవస్థలో మంచు రూపంలో నీటి ఆనవాళ్లను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు.
అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) సాయంతో దీన్ని కనుక్కున్నారు.
భూమికి 1,500 కాంతిసంవత్సరాల దూరంలోని ఒరాయన్ నెబ్యులాలో ఉన్న ఒక భారీ ప్రొటోప్లానెటరీ వలయంలో ఈ నీటి జాడను గుర్తించారు.
114-426 అనే నక్షత్ర వ్యవస్థ చుట్టూ ఇది కనిపించింది. 3 మైక్రాన్ల తరంగదైర్ఘ్యంలో ఇది వెలుగుచూసింది. ఇది ధూళితో నిండిన ఐస్‌కు ఇది సంకేతం.