సూర్యుడ్ని పోలిన వైఎస్‌ఇఎస్-1 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న రెండు బాహ్య గ్రహాలను జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
వాటికి వైఎస్‌ఇఎస్ 1బి, 1సి అని పేర్లు పెట్టారు. సౌర కుటుంబానికి వెలుపల గ్రహాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ ఉపకరిస్తోంది.
శాస్త్రవేత్తలు వీటిని బాహ్య గ్రహాలుగా పరిగణిస్తారు.
సుమారు 1.67 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ గ్రహాలు ఇప్పటికీ వేడిగా ఉన్నాయి.