Published on May 20, 2025
Current Affairs
సారస్వత పరిషత్తు పురస్కారాలు
సారస్వత పరిషత్తు పురస్కారాలు

తెలంగాణ సారస్వత పరిషత్తు.. 2025 సంవత్సరానికి వివిధ ప్రక్రియల్లో 7 ఉత్తమ గ్రంథాలకు 2025, మే 19న పురస్కారాలు ప్రకటించింది.

ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందిస్తామని సారస్వత పరిషత్తు పేర్కొంది.

పద్య/గేయ కవిత్వంలో డా.కాంచనపల్లి గోవర్ధనరాజు రచించిన ‘నిరుడు కురిసిన నిప్పు-బల్మూరి కొండలరాయుడు’ గ్రంథం; వచన కవిత్వంలో ఉదారి నారాయణ రచించిన ‘మళ్లీ మనిషిలోకి’ కవితా సంపుటి; నవలా విభాగంలో డా.కాలువ మల్లయ్య రచించిన ‘గువ్వల చెన్నా’ నవల; సాహిత్య విమర్శలో డా.సంగిశెట్టి శ్రీనివాస్‌ రచించిన ‘సవారు’ ముస్లిం వ్యాసాలు; కథాప్రక్రియలో రామచంద్రమౌళి రచించిన ‘నిర్వాణ’ కథల సంపుటి; ఇతర ప్రక్రియల విభాగంలో సంగనభట్ల నరసయ్య రచించిన ‘కోటిలింగాల-తెలంగాణ ప్రాచీన చారిత్రక వ్యాసాలు’ గ్రంథం; బాలసాహిత్యంలో డా.అమరవాది నీరజ రచించిన ‘ఏడురంగుల జెండా’ పుస్తకం పురస్కారాలకు ఎంపికయ్యాయి.