Published on Aug 23, 2025
Current Affairs
సురవరం కన్నుమూత
సురవరం కన్నుమూత

కమ్యూనిస్టు దిగ్గజం, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) 2025, ఆగస్టు 22న హైదరాబాద్‌లో మరణించారు.

విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన... మూడు దఫాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించారు.

1988, 2004లో నల్గొండ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2000లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు.

2012 పట్నాలో జరిగిన జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

2015లో పుదుచ్చేరిలో, 2018లో కొల్లాంలో జరిగిన మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

2021 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో 2019 జులై 24న వైదొలిగారు.