హైదరాబాద్‌కు చెందిన భారతీయ రసాయన సాంకేతికత సంస్థ(ఐఐసీటీ) శాస్త్రవేత్తలు సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ‘జెడ్‌ఐఎఫ్-8 నానో హైబ్రిడ్స్’ అనే అత్యాధునిక పదార్థాలను అభివృద్ధి చేశారు. రసాయన చర్యలను వేగవంతం చేసే అద్భుతమైన గుణాలను ఇది కలిగి ఉందని వారు తెలిపారు. ఈ కొత్త పద్ధతిలో కేవలం సూర్యరశ్మిని వాడుకుని నీటి నుంచి లేదా ఇతర వనరుల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయవచ్చని నిరూపించారు.
ఈ పదార్థాల తయారీలో వాటి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఏఐ/ఎంఎల్, డెన్సిటీ ఫంక్షనల్ థియరీ(డీఎఫ్‌టీ) సాంకేతికతను వినియోగించారు.