సూర్యగోళంలో సంభవిస్తున్న పరిణామాల పరిశీలనకు ఐఐటీ- కాన్పుర్‌కు చెందిన పరిశోధకులు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా డేటా ఆధారిత త్రీడీ నమూనాను రూపొందించారు. ఈ నమూనా ఖగోళ వాతావరణ అధ్యయనానికి ఎంతో కీలకం కానుంది. సూర్యునిపై నిరంతరం సౌర తుపానుల వంటి పరిణామాలు సంభవిస్తూనే ఉంటాయి. ఈ పరిణామాలు కొన్నిసార్లు తీవ్రంగా, మరికొన్నిసార్లు తేలికగా ఒక నిరంతర వృత్తంలా సాగుతుంటాయి. 11 సంవత్సరాలు సాగే ఈ సౌర వలయంలో అత్యధిక పరిణామాలు సంభవించే కాలాన్ని మ్యాగ్జిమా అని, అత్యల్ప కార్యకలాపాల కాలాన్ని మినిమా అని పిలుస్తారు.