Published on Mar 24, 2025
Current Affairs
సెర్ప్‌లో మెప్మా విలీనం
సెర్ప్‌లో మెప్మా విలీనం

తెలంగాణలోని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2025, మార్చి 23న ఉత్తర్వులు (జీవో 15) జారీ చేసింది.

ఇందిరా మహిళాశక్తి మిషన్‌ కింద రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాలను ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

దీనిద్వారా ఇకపై గ్రామీణ, పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ సెర్ప్‌ పరిధిలోకి వస్తాయి.