- ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రాంతాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు కృషి చేయడంతోపాటు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సంస్థ ‘దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి - సార్క్ (South Asian Association for Regional Cooperation - SAARC). ఇది ఏర్పడిన తేదీని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 8న ‘సార్క్ చార్టర్ డే’గా (SAARC Charter Day) నిర్వహిస్తారు. దక్షిణాసియా దేశాల మధ్య అభివృద్ధి, సహకారాన్ని పెంపొందించడంలో సార్క్ పాత్రను గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- చారిత్రక నేపథ్యం
- 1985, డిసెంబరు 8న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించిన సమావేశంలో సార్క్‌ను ఏర్పాటుచేశారు. దీనికి సంబంధించిన చార్టర్‌పై సభ్యదేశాలు సంతకాలు చేశాయి. సార్క్ దేశాల్లో ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, స్వావలంబనను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఆ తేదీన ‘సార్క్ చార్టర్ డే’గా నిర్వహిస్తారు.