Published on Nov 13, 2025
Government Jobs
సెయిల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టులు
సెయిల్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌): 124

వివరాలు:

విభాగాలు: కెమికల్, సివిల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, మెకానికల్, మెటలర్జీ.  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో డిగ్రీ (కెమికల్, సివిల్‌, కంప్యూటర్‌, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్‌, మెకానికల్, మెటలర్జీ), పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 2025 డిసెంబర్‌ 5వ తేదీ నాటికి 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.50,000 నుంచి 1,60,000. సంవత్సరం తరువాత నెలకు రూ.60,000 - రూ.1,80,000.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1050, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.300.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 నవంబర్‌ 15.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 5.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.

పరీక్ష తేదీ: 2026 జనవరి/ఫిబ్రవరి.

Website:https://sailcareers.com/AppErrors.aspx?type=500