వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్టు నిమిత్తం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్‌కు భారత్ రూ.8.52 కోట్ల (9,90,000 డాలర్లు) ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
తమ దేశంలో వికలాంగులకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడం కోసం సియర్రా లియోన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా భారత్ తాజా సహాయం అందించనుందని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) పేర్కొంది.
2017లో భారత ప్రభుత్వం స్థాపించిన ‘ఇండియా-ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ పార్టనర్‌షిప్ ఫండ్’ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పలు ప్రాజెక్టులకు మద్దతును ప్రకటిస్తోంది.
ఆయా దేశాలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతోంది.