ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) 2027-2030 సీజన్‌కు సంబంధించి నూతన షెడ్యూల్‌లో భారత్‌కు కేటాయించాల్సిన టోర్నీల సంఖ్యను నాలుగు నుంచి రెండుకు తగ్గించింది. లఖ్‌నవూలో జరిగే సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీ హోదాను సూపర్ 300 నుంచి 100కు కుదించింది. 2023లో ప్రారంభమైన గువాహటి, ఒడిశా సూపర్ 100 టోర్నీలను క్యాలెండర్ నుంచి తప్పించింది.
అయితే ఇటీవల నిర్వహణ లోపాలపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ తన సూపర్ 750 హోదాను నిలబెట్టుకుంది. బ్యాడ్మింటన్‌ను ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ పేర్కొంది.