సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్లు గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ టైటిల్ నెగ్గారు. 2025, నవంబరు 30న లఖ్‌నవూలో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ గాయత్రి- ట్రీసా జోడీ 17-21, 21-13, 21-15తో కాహో ఒసావా- మయ్ తనాబె (జపాన్) జంటపై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు.