ఒక ఏడాదిలో మిలియన్ డాలర్ల నగదు బహుమతిని గెలుచుకున్న తొలి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా దక్షిణ కొరియా స్టార్ ఆన్ సేయంగ్ ఘనత సాధించింది. 2025, డిసెంబరు 21న ఆమె బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఆమె 21-13, 18-21, 21-10తో వాంగ్ జియి (చైనా)ని ఓడించింది. ఈ టోర్నీకి దక్కిన దాంతో కలిపి 2025లో సేయాంగ్ మొత్తం నగదు బహుమతి మిలియన్ డాలర్లు దాటింది.