కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ అకాడమిక్ సెషన్ 2026-27 ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తారు.
వివరాలు:
సీయూఈటీ పీజీ 2026
స్పెషలైజేషన్లు:
లాంగ్వేజెస్
సైన్స్
హ్యూమానిటీస్
కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్
ఎంటెక్/హయ్యర్ సైన్సెస్
ఆచార్య
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: వయసు పరిమితి లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మల్టిపుల్ చాయిస్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో 74 ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు, ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు (2 పరీక్ష పత్రాలకు):
జనరల్ అభ్యర్థులకు రూ.1400; ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/థర్డ్‌జెండర్ అభ్యర్థులకు రూ.1100; దివ్యాంగులకు రూ.1000.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సిక్రిందాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడేం, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నరసరావుపేట, పొద్దుటూరు, సూరంపాలెం, నంధ్యాల, తాడేపల్లిగూడెం.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.01.2026.
ఆన్‌లైన్ రాత పరీక్ష: మార్చి 2026.