సమీర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతాలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్ (సమీర్) ఒప్పంద ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల సంఖ్య: 06.
వివరాలు:
రిసెర్చ్ సైంటిస్ట్ (ఆర్‌ఎప్ అండ్ మైక్రోవేవ్స్)- 01
రిసెర్చ్ సైంటిస్ట్ (ఫిజిక్స్)- 01
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫిజిక్స్)- 01
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఫిట్టర్)- 01
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (టర్నర్)- 01
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (మెషినిస్ట్)- 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ బీకాం, ఎంటెక్, ఎంఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు సీనియర్ సైంటిస్ట్ పోస్టుకు రూ.32,000; ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.19,000; ప్రాజెక్ట్ టెక్నీషియన్-ఏకు రూ.17,100; ప్రాజెక్ట్ టెక్నీషియన్- బికు రూ.21,100.
వయోపరిమితి: సీనియర్ సైంటిస్ట్‌కు 30ఏళ్లు; ప్రాజెక్ట్ అసిస్టెంట్-ఏ, ప్రాజెక్ట్ టెక్నీషియన్-బీకు 25ఏళ్లు, ప్రాజెక్ట్ టెక్నీషియన్-బీకు 35ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి, రాత పరీక్ష/ స్క్రినింగ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 11-04-2025.
Website: https://sameer.gov.in/
Apply online: https://recruit.sameer.gov.in/