2025లో మనదేశం నుంచి 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.7 లక్షల కోట్ల) విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2026, ఫిబ్రవరి 25న పేర్కొన్నారు. గతేడాది మనదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యింది కూడా స్మార్ట్‌ఫోన్లేనని తెలిపారు. 2025లో మన దేశంలో రూ.5.5 లక్షల కోట్ల (60 బి.డాలర్ల) విలువైన మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2024-25లో ఈ విభాగ ఎగుమతులు దాదాపు రూ.2 లక్షల కోట్లు (22 బి.డాలర్లు)గా ఉన్నాయి.
2025లో దేశం నుంచి మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు (44 బి.డాలర్లు) మించాయి.