Published on Sep 30, 2024
Admissions
సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో బీఏ ప్రోగ్రామ్
సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో బీఏ ప్రోగ్రామ్

ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బీఏ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.

వివరాలు:

1. బీఏ ఇంగ్లిష్ (ఆనర్స్)

అర్హత: కనీసం 60% మార్కులతో ప్లస్‌ టూ (ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.

2. బీఏ ఎకనామిక్స్‌ (ఆనర్స్)

అర్హత: ఏదైనా స్ట్రీమ్‌లో కనీసం 60% మార్కులతో ప్లస్‌ టూ (ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా), సీయూఈటీ-యూజీ 2024 ఉత్తీర్ణులై ఉండాలి.

సెమిస్టర్లు: 8.

వ్యవధి: నాలుగేళ్లు.

ప్రవేశ ప్రక్రియ: మొదటి ప్రాధాన్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ-యూజీ 2024 స్కోరు, రెండో ప్రాధాన్యంగా ఇంటర్‌ విద్యార్హత ఆధారంగా సీటు కేటాయిస్తారు.

స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్: 03-10-2024.

వేదిక: యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ భవనం), ట్రాన్సిట్ క్యాంపస్, జాకారం గ్రామం, ములుగు.

Website:https://ssctu.ac.in/