- సముద్రాల్లో నివసించే సూక్ష్మజీవులపై అధ్యయనం చేసేందుకు ‘డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రిపాజిటరీ’ కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటుచేస్తున్నట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇది దేశంలోనే మొదటి పరిశోధన కేంద్రం అవుతుందని పేర్కొన్నారు.
- సముద్ర సూక్ష్మజీవులు అధిక హైడ్రోస్టాటిక్ పీడనం, తక్కువ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లేకుండా తట్టుకుని జీవించే స్వభావం కలిగి ఉంటాయి. నెల్లూరులో ఏర్పాటుచేసే ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు పారిశ్రామిక, బయోమెడికల్ పరిణామాలకు సంబంధించి సూక్ష్మజీవులపై అధ్యయనం చేస్తారు.