Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 6, 2026
Current Affairs
‘సముద్ర ప్రతాప్‌’
‘సముద్ర ప్రతాప్‌’

‘సముద్ర ప్రతాప్‌’ నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జలప్రవేశం చేయించారు. గోవా షిప్‌యార్డ్‌లో 2026, జనవరి 5న ఈ కార్యక్రమం జరిగింది. కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా రూ.2,500 కోట్లతో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఈ నౌకను నిర్మించింది. సముద్ర జలాల్లో కాలుష్యాన్ని.. ముఖ్యంగా చమురు వ్యర్థాలను నిర్మూలించి జలచరాలను కాపాడేందుకు దోహదపడే అధునాతన సాంకేతికత ఇందులో ఉంది.