Published on May 16, 2025
Current Affairs
సముద్ర జలాల శుద్ధి
సముద్ర జలాల శుద్ధి

సముద్ర జలాలను శుద్ధి చేయడానికి అధిక పీడనంతో కూడిన దేశీయ నానో రంధ్రాల బహుళ అంచెల పాలిమెరిక్‌ పొరలను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆవిష్కరించింది. కాన్పుర్‌లోని డీఆర్‌డీవోకు చెందిన రక్షణ సామగ్రి స్టోర్స్, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీన్ని భారత తీర ప్రాంత రక్షణ నౌకల్లో (ఐసీజీ) వినియోగించనున్నారు. శుద్ధి చేసిన సముద్ర జలాలు.. క్లోరైడ్‌ అయాన్స్‌ ప్రభావానికి లోనైనప్పుడూ స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉండగలిగేలా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసినట్లు 2025, మే 15న రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.