సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే మనదేశం నాలుగో స్థానానికి చేరినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది.
2024-25లో మనదేశం నుంచి 130 దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. 2014-15లో మన ఉత్పత్తులు తరలి వెళ్లిన దేశాల సంఖ్య 105గా ఉంది.
2014-15లో 10.51 లక్షల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా.. 2024-25లో 16.85 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగాయి.
అధునాతన ఆక్వా పద్ధతులు, శీతల గిడ్డంగులు - రవాణా మౌలిక సదుపాయాలు పెరగడం, సాగు-నిల్వలో అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి.