Published on Sep 15, 2025
Current Affairs
సముద్ర అధ్యయనానికి సరికొత్త సాంకేతికత
సముద్ర అధ్యయనానికి సరికొత్త సాంకేతికత

సముద్ర గర్భంలోని రహస్యాలను తెలుసుకోవడానికి తాజాగా చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ) సముద్రం నుంచి డేటాను సేకరించడానికి కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

‘బోట్‌-బేస్డ్‌ రియల్‌-టైమ్‌ టోవ్డ్‌ ప్రొఫైలింగ్‌ ఓషన్‌ అబ్జర్వేషన్‌ సిస్టమ్‌’ అనే కొత్త టెక్నాలజీని సిద్ధం  చేసింది.

దీని ద్వారా ఫిషింగ్‌ బోటును ఉపయోగించి సముద్రగర్భంలోని సమాచారాన్ని సేకరించవచ్చు. 

సాగరంలోని వాతావరణం, జీవరాశులు, ఖనిజాలు తదితరాల సమాచారాన్ని సేకరించి.. అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.