2024 ఏడాదికి మేటి మహిళా వన్డే క్రికెటర్‌గా ఐసీసీ భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధానను ఎంపిక చేసింది.
ఆమె 2024లో 13 ఇన్నింగ్స్‌ల్లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో నాలుగు శతకాలున్నాయి.
అంతర్జాతీయ మహిళల వన్డేల్లో గతేడాది (2024) అత్యధిక పరుగుల రికార్డు మంధానదే.
ఆమె 2018, 2012లోనూ ఐసీసీ మహిళా క్రికెటర్‌గా అవార్డు గెలుచుకుంది.