2025, జనవరి 27న వెలువడిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ (565 పాయింట్లు) 106వ ర్యాంకులో నిలిచాడు.
గతంలో టాప్-100లో ఉన్న అతడు ప్రస్తుతం 16 స్థానాలు నష్టపోయి ఈ ర్యాంకులో ఉన్నాడు.
2024 మార్చిలో తొలిసారి టాప్-100లో చోటు దక్కించుకున్న నగాల్.. ఆ ఏడాది జులై నుంచి 18 టోర్నీలు ఆడి మూడు మెయిన్‌డ్రా మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగాడు.
టాప్-100లో ఉన్న ప్లేయర్లకు పెద్ద టోర్నీల్లో నేరుగా ఆడే అవకాశం దక్కుతుంది. ఆరంభంలోనే ఓడినా కూడా మంచి ప్రైజ్‌మనీ లభిస్తుంది.