- పచ్చదనంలో దక్షిణాదిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 24.69 శాతం ఉన్నాయి. జాతీయ సగటు 23.59 శాతం కంటే రాష్ట్రంలో అధికంగా పచ్చదనం ఉందని సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తెలిపింది. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో 2018లో 12గా ఉన్న పెద్దపులుల సంఖ్య 2026 నాటికి 42కి పెరిగిందని వెల్లడించింది. జిల్లాల వారీగా అటవీ విస్తీర్ణంతో పాటు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వనమహోత్సవంలో నాటుతున్న మొక్కలు..పక్షి, వృక్ష జాతులు, వివిధ రకాల జంతువుల వివరాలను తెలియజేసింది.
- అటవీ విస్తీర్ణాన్ని వనమహోత్సవంతో 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 2024-25లో 19.03 కోట్లు..2025-26లో 15.73 కోట్ల మొక్కలు నాటించింది.