Published on Sep 3, 2025
Current Affairs
సెమీకాన్‌ ఇండియా సదస్సు
సెమీకాన్‌ ఇండియా సదస్సు

ప్రధాని నరేంద్ర మోదీ 2025, సెప్టెంబరు 2న దిల్లీలోని యశోభూమిలో ‘సెమీకాన్‌ ఇండియా 2025’ సదస్సును ప్రారంభించారు.

50 దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.

ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ తదుపరి దశలో 18 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.58 లక్షల కోట్ల) 10 సెమీకండక్టర్‌ ప్రాజెక్టులు మన దేశంలో రాబోతున్నాయని మోదీ వెల్లడించారు.

డిజైన్‌ అనుసంధానిత ప్రోత్సాహక(డీఎల్‌ఐ)పథకం లక్ష కోట్ల డాలర్ల అంతర్జాతీయ చిప్‌ మార్కెట్‌ను సైతం అందిపుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో మోదీకి భారత తొలి స్వదేశీ 32-బిట్‌ చిప్‌ అయిన ‘విక్రమ్‌-3201’ని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అందించారు.

ఈ చిప్‌ను చండీగఢ్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన సెమీకండక్టర్‌ లేబోరేటరీ రూపొందించింది.

ఇది 32- బిట్‌ మైక్రోప్రాసెసర్‌.