ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో నిస్వార్థంగా సేవ చేసిన సంస్థలు, వ్యక్తులకు కేంద్ర హోంశాఖ ప్రదానం చేసే ‘సుభాష్‌చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2025’ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు దక్కింది.
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఈ అవార్డును 2019 నుంచి ఏటా జనవరి 23న కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది.
ఈ అవార్డుకు ఎంపికైన సంస్థలకు రూ.51 లక్షల నగదు, ధ్రువపత్రం, వ్యక్తులకైతే రూ.5 లక్షల నగదు, ధ్రువపత్రం అందిస్తారు.
2025లో ఈ అవార్డు కోసం 297 నామినేషన్లు రాగా అందులో ఇన్‌కాయిస్‌ను కేంద్రం ఎంపిక చేసింది.