సవాళ్లతో కూడిన ఎత్తైన ప్రాంతాలకు సామగ్రి చేరవేయడంలో ఉపయోగపడే ‘సబల్ 20 లాజిస్టిక్స్ డ్రోన్’ను ఎండ్యూర్‌ఎయిర్ సిస్టమ్స్ సంస్థ 2024, నవంబరు 27న భారత సైన్యానికి అందజేసింది.
రక్షణ, పౌర అవసరాలకు ఉపయోగపడేలా ప్రత్యేక డ్రోన్ల తయారీకి ఐఐటీ కాన్పుర్ ప్రాంగణంలో 2018లో ఈ అంకుర సంస్థ ఆవిర్భవించింది. మానవరహిత హెలికాప్టర్లలా ఇవి సేవలందిస్తూ 20 కిలోల వరకు బరువును మోసుకుపోగలవు.