Published on Nov 11, 2024
Government Jobs
సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు
సీబీఐలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అసిస్టెంట్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్‌ పెన్షన్‌లలో భర్తీ కానున్నాయి. 

మొత్తం పోస్టులు: 27 (యూఆర్‌- 08, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 09, ఎస్సీ- 04, ఎస్టీ- 02)

వివరాలు:

అర్హత: బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ). లేదా బ్యాచిలర్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణతతో రెండేళ్ల అనుభవం ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీ (కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (కంప్యూటర్ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. 

గరిష్ఠ వయో పరిమితి: 29.11.2024 నాటికి అన్‌రిజర్వ్‌డ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు, ఓబీసీలు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలు 35 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2024.

Website:https://www.upsc.gov.in/%5C

Apply online:https://upsconline.nic.in/ora/VacancyNoticePub.php