Published on Dec 4, 2025
Government Jobs
సీబీఎస్‌ఈలో జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు
సీబీఎస్‌ఈలో జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డు (సీబీఎస్ఈ) వివిధ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 124

వివరాలు:

1. అసిస్టెంట్‌ సెక్రటరీ: 08

2. అసిస్టెంట్ ప్రొఫెసర్ & అసిస్టెంట్ డైరెక్టర్ (అకాడమిక్స్/ట్రైనింగ్/స్కిల్ ఎడ్యుకేషన్): 27

3. అకౌంట్స్ ఆఫీసర్: 02

4. సూపరింటెండెంట్: 27

5. జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 09

6. జూనియర్ అకౌంటెంట్: 16

7. జూనియర్ అసిస్టెంట్: 35

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌ ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: వివిధ విభాగాల్లోని పోస్టులను అనుసరించి 27 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. కానీ రూ.250 ప్రాసెసింగ్ ఫీజు తప్పనిసరి. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు గ్రూప్-ఏ పోస్టులకు రూ.1750. గ్రూప్-బీ, సీ పోస్టులకు రూ.1050 ఫీజు ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం: 

పోస్టుల గ్రూప్‌ను బట్టి ఎంపిక ప్రక్రియ మూడు అంచెలుగా ఉంటుంది:

టైర్‌-1: MCQ ఆధారిత ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్ష.

టైర్‌-2: ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ (రాత) ప్రధాన పరీక్ష.

టైర్‌-3: ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటరాక్షన్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 22.

ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 2025 డిసెంబర్‌ 22.

Website:https://www.cbse.gov.in/cbsenew/cbse.html