ప్రపంచంలోని 12 ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో ఒకటిగా బెంగళూరు నిలిచినట్లు స్థిరాస్తి సేవల సంస్థ సీబీఆర్‌ఈ తన ‘గ్లోబల్ టెక్ టాలెంటెడ్ గైడ్‌బుక్ 2025’లో వెల్లడించింది.
ఈ నగరంలో టెక్ నిపుణుల సంఖ్య 10 లక్షల మార్కును మించినట్లు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా 115 మార్కెట్లను ఇది పరిగణనలోకి తీసుకుంది.
ప్రధాన టెక్నాలజీ హబ్‌లలో మొదటి 11 నగరాలు వరుసగా.. బీజింగ్, బోస్టన్, లండన్, న్యూయార్క్ మెట్రో, పారిస్, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా, సీటెల్, షాంఘై, సింగపూర్, టోక్యో, టొరంటో.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో బీజింగ్, షాంఘైతో పాటు అతి పెద్ద మార్కెట్‌గా బెంగళూరు నిలిచిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణల్లో ఈ నగరం కీలకంగా మారిందని తెలిపింది.