Published on Mar 13, 2025
Current Affairs
స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ ప్రయోగం
స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ ప్రయోగం

గతంలో ఎన్నడూ లేనంత సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ అబ్జర్వేటరీని నాసా అంతరిక్షంలోకి పంపింది.

దీనితో పాటు మరో నాలుగు ఉపగ్రహాలనూ నాసా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాలు సూర్యుడి ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి.

స్ఫియరెక్స్‌ అబ్జర్వేటరీ ద్వారా సేకరించే ఖగోళ సమాచారం జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్, హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ల నిరంతర విశ్లేషణలకు సహాయకారిగా ఉండబోతోంది.

స్పేస్‌ ఎక్స్‌గా ప్రసిద్ధమైన స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టెక్నాలజీస్‌ సంస్థ కాలిఫోర్నియా నుంచి స్ఫియరెక్స్‌ టెలిస్కోప్‌ అబ్జర్వేటరీని ప్రయోగించింది.