Published on Apr 29, 2025
Current Affairs
సిప్రి’ నివేదిక
సిప్రి’ నివేదిక

భారతదేశ సైనిక వ్యయం పాకిస్థాన్‌ సైనిక వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువని ప్రముఖ స్వీడిష్‌ అధ్యయన సంస్థ స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) వెల్లడించింది.

ఈ మేరకు 2024కు సంబంధించిన నివేదికను 2025, ఏప్రిల్‌ 28న విడుదల చేసింది.

సిప్రి ‘థింక్‌ ట్యాంక్‌-2024’ అధ్యయనం ప్రకారం.. భారత సైనిక వ్యయం 1.6 శాతం మేర పెరిగి 86.1 బిలియన్‌ డాలర్ల(రూ.7.3 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది.

అదే సమయంలో పాకిస్థాన్‌ సైనిక వ్యయం 10.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైనిక వ్యయం కలిగిన దేశాల జాబితాను పరిశీలిస్తే అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, భారత్‌ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

ఈ ఐదు దేశాల సైనిక వ్యయం ప్రపంచ సైనిక వ్యయంలో 60 శాతం వాటా కలిగి ఉంది.