రష్యాతో దీర్ఘకాలంగా యుద్ధం సాగిస్తున్న ఉక్రెయిన్ 2020-24కు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది.
ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. 2015-19తో పోలిస్తే ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు వంద శాతం పెరిగాయి.
ఈ మేరకు అంతర్జాతీయ మేధో మథన సంస్థ స్టాక్‌హోమ్ ఇంటర్‌నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రీ) ఒక నివేదికను విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:
2015-19 నుంచి 2024 కాలంలో భారత ఆయుధ దిగుమతులు 9.3 శాతం మేర తగ్గాయి. ఇదే కాలంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు 155 శాతం పెరిగాయి.
ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా పెరిగి, 43 శాతానికి చేరింది. రష్యా ఎగుమతులు ఏకంగా 64 శాతం మేర పడిపోయాయి.
అంతర్జాతీయంగా భారత్ చేసుకున్న ఆయుధ దిగుమతుల్లో అధిక భాగం (36 శాతం).. రష్యా నుంచే వచ్చాయి. అయితే 2015-19లో అది 55 శాతంగా, 2010-14లో 72 శాతంగా ఉండేది.