సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలీలు 2025, ఆగస్టు 29న పదవీ స్వీకార ప్రమాణం చేశారు.
అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్ వారి చేత ప్రమాణం చేయించారు.
దీంతో సీజేఐతో సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యాబలం 34కు చేరింది.
ఇది కోర్టు పూర్తి కార్యనిర్వాహక సామర్థ్యం.
కొత్తగా నియమితులైన జస్టిస్ పంచోలీ 2031 అక్టోబరులో జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ పదవీ విరమణ అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు.
ఆయన 2031 అక్టోబరు 3 నుంచి 2033, మే 27 వరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారు.