Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 27, 2026
Government Jobs
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు
స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ) వివిధ క్రీడా విభాగాల్లో అసిస్టెంట్ కోచ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు:

అసిస్టెంట్ కోచ్‌లు: 323

విభాగాలు: అథ్లెటిక్స్, షూటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, ఆర్చరీ, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, రోయింగ్‌, త్వైఖాడో, ఆర్చరీ, టెన్నిస్‌, వుషూ, కబడ్డీ తదితరాలు.

అర్హతలు: విద్యార్హత: ఎస్‌ఏఐ ఎన్‌ఎస్‌-ఎన్‌ఐఎస్‌ పాటియాలా నుంచి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. (లేదా) ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఆసియా క్రీడలు/ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న క్రీడాకారులు (కోచింగ్ సర్టిఫికేట్ కోర్సుతో) లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్‌ఏఐ ఉద్యోగులు/ఎక్స్‌ సర్విస్‌మెన్‌ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

వేతనం: నెలకు రూ.35,400 - రూ.1,12,400.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక రెండు దశల్లో ఉంటుంది.

సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 100 మార్కులకు (స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌, స్పోర్ట్స్ సైన్స్, ఆప్టిట్యూడ్).

సీఏటీ (కోచింగ్ ఎబిలిటీ టెస్ట్): ఇది ప్రాక్టికల్ పరీక్ష. సీబీటీలో మెరిట్ సాధించిన వారిని 1:3 నిష్పత్తిలో దీనికి పిలుస్తారు.

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ.2,500, ఎస్సీ/ఎస్టీ, మహిళలకు రూ.2,000.

పరీక్ష కేంద్రాలు: దిల్లీ, లఖ్‌నవూ, చండీగఢ్, భోపాల్, గాంధీనగర్, ముంబయి, కోల్‌కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, గువాహటి, ఇంఫాల్‌.

దరఖాస్తు చివరి తేదీ: 21.04.2026.

Website:https://test.cbexams.com/EDPSU/SAI/AssistantCoaches/Instruction.aspx?skey=639101489779265431