కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ 2025, మార్చి 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ వెల్లడించారు. నియామకం ఖరారు కావడంతో ఆయన సుప్రీంకోర్టులో ఆరేళ్లకు పైగా సేవలందించనున్నారు.
జస్టిస్ కె.వి.విశ్వనాథ్ పదవీ విరమణ అనంతరం 25 మే 2031 నుంచి 2 అక్టోబరు, 2031 వరకూ జస్టిస్ బాగ్చీ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది.
జస్టిస్ బాగ్చీ నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. కేటాయించిన సంఖ్య 34.