న్యాయవాదులకు సీనియర్ స్థాయి కల్పించేందుకు సంబంధించి సుప్రీంకోర్టు 2025, మే 13న కొత్త మార్గనిర్దేశకాలు ప్రకటించింది.
పాయింట్ల ఆధారంగా అడ్వొకేట్లకు ఉన్నత న్యాయస్థానాలు సీనియర్ స్థాయి కల్పించే పద్ధతికి స్వస్తి పలికింది.
న్యాయవాదుల ప్రతిభను హేతుబద్ధంగా, నిష్పాక్షికంగా అంచనా వేయడం ఇలా సాధ్యం కాదని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్‌ల ధర్మాసనం పేర్కొంది.
కొత్తగా సూచించిన మార్గదర్శకాల మేరకు నాలుగు నెలల్లోగా నిబంధనలు సవరించుకోవాలని హైకోర్టులను ఆదేశించింది.
సీనియర్ స్థాయి కల్పించాలన్న నిర్ణయం సంపూర్ణ (ఫుల్) సుప్రీంకోర్టు, హైకోర్టులదేనని ధర్మాసనం వెల్లడించింది.